సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల చైతన్య ఆటో యూనియన్ సభ్యులైన కోరిబిల్లి రవికుమార్ ఇటీవలే మరణించారు. నేడు బుధవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు చైతన్య ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ సభ్యులు కలిసి రూ 78 వేలు సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా రెడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమనిఆటో యూనియన్ సభ్యులు కలిసి కట్టుగా తోటివారిని ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చెన్నంశెట్టి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ జయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్కా శ్రీనివాస్ రావు, కన్వీనర్ బి కోటేశ్వర రావు, పంతకానీ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
