సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆనందరాజు పౌండేషన్ అధ్వర్యంలో స్వర్గీయ ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా గత శుక్రవారం రాత్రి ఆనంద స్త్రీ పురస్కారాలు ను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సతీమణి అన్నపూర్ణ, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా కొల్లూరి వందన (తిరుపతి), జిల్లా వైద్య అధికారిణి గీతాబాయి, పోలీస్ శాఖ, ఆనంద గ్రూప్ కు చెందిన 6 గురు ఉత్తమ సేవాతాత్పరులకు, 50 మంది మున్సిపల్ మహిళ పారిశుధ్య కార్మికులకు పురస్కారాలను అందించి సత్కరించారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మరియు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు ప్రధాన ఆయుధమని, ఎలాంటి పరిస్థితిల్లో కూడా ధైర్యం కోల్పోవద్దని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్ రాజు, దాయన చంద్రజీ, రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
