సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గత దశాబ్ది గా భీమవరం పట్టణం ఆర్ధికంగా అన్ని రంగాలలో శరవేగంగా ఎదుగుతున్న నగరంగా ‘మినీ దుబాయ్”గా ఒక ప్రత్యేక బ్రాండ్ సాధించింది, దానితో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖ బ్రాండ్ షోరూంలు అన్ని తమ బ్రాంచ్ లు ఇక్కడ తెరవడం ప్రతిష్టాకరంగా తీసుకొంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని షోరూమ్ లు కోట్లాది రూపాయల టర్నవర్ అమ్మకాలతో అదరగొట్టేసాయి. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన బడా వస్త్ర దుకాణాలు దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి బాగా మారింది. కొత్త గా ప్రారంభించిన బడా వస్త్ర షాపింగ్ మాల్స్ కొన్ని మాత్రమే విజయం సాధిస్తున్నాయి ఎందుకంటే వీరిలో చాల మంది లాజికి మిస్ అయ్యారు.. భీమవరం ప్రజలకు పలు నగరాలలో షాపింగ్ చేసే అలవాటు ఉంది. వారికీ లేటెస్ట్ డిజెన్స్, వాటి రేట్లు బాగా తెలుసు.. ఇక అలాగే శుభకార్యాలకు బల్క్ గా వస్త్రాలను క్వాలిటీ పాటు, తక్కువ లాభాలు వేసుకొని విక్రయించే పట్టణంలో పేరున్న వస్త్ర దుకాణాలతో పాటు..సమీపంలోని, ‘గణపవరం, పాలకొల్లు’ వెళ్లి అక్కడ చిన్న సందులలో హోల్ సెల్ వ్యాపారుల వద్ద టోకుగా లక్షలాది రూపాయలు సరుకు కొంటున్నారు. ఇక్కడి మహిళలకు నాణ్యత ,ఫ్యాషన్స్, పట్టు, జరీ అంచుల గురించి మంచి అవగాహన ఉంది, ఈ విషయం తెలియక కొందరు బడా వస్త్ర సంస్థలు ఇక్కడ వారికీ ఆఫర్స్ పేరుతొ , ముగ్ధ మనోహర సెటింగ్స్ వేసి ఇంటి మహాలక్ష్మిలకు, కావ్య కన్యలకు ప్రత్యేక ఆఫర్స్ అంటూ ఒక్కక్క ప్లోర్ కు ఒకొక్క సీజన్ లో కొత్త రి ఓపెనింగ్స్ చేస్తున్న.. హడావిడి కి అంతులేదు. అయితే… వినియోగదారులకు నాసిరకం వస్త్రాలు అంటగడుతూ, రేట్లు పెంచేసి ఆఫర్స్ పేరుతొ చేసిన జిమ్మిక్కు ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి, ఇటీవల పలు భారీ షాపింగ్ మాల్స్ లో అమ్మకాలులేక, స్టాప్ ను భారీగా తగ్గిస్తూ, ఉన్నవారికి జీతాలు, అద్దెలు, సక్రమంగ చెల్లించలేకపుతున్న దీనపరిస్థితులు కనపడుతున్నాయి,.. ప్రారంభించి ఏడాదిన్నర తిరగకుండానే అమ్మకాలు లేక తమ షాపింగ్ మాల్ లో ఆభరణాల విభాగాన్ని మూసివేసిన సంస్థలు కూడా ఉన్నాయి, భీమవరం జిల్లా కేంద్రంగా మారటంతో జిల్లా లో అన్ని ప్రాంతాల నుండి ప్రజల రాకపోకలు మరింత పెరిగి, వ్యాపారాలు కోట్లాది రూపాయలు పెరిగిన మాట వాస్తవం. కొన్ని బడా సంస్థలు ఇక్కడ సుదీర్ఘ కాలంగా వస్త్ర వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త పాఠాలు నేర్పటంమాని, వినియోగదారులతో నమ్మకంఫై ద్రుష్టి పెడితే భీమవరం ఆర్ధిక అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారు. ఎందరికో ఉపాధి ఇచ్చినవారు అవుతారు, కేవలం జిమ్మికులను నమ్ముకుంటే ఉత్తర కుమారులుగా మిగిలిపోతారు.. సిగ్మా కాలమ్స్
