సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భారతదేశ మానస పుత్రిక మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని అని కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరు బాపిరాజు అన్నారు. నేడు, మంగళవారం భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగంలను. ప్రాధాన్యతను ఎవరూ చెప్పకపోవడం వల్ల ప్రజలు మరిచిపోతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తిలక్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో దేశభక్తులు నాయకులు కార్యకర్తలు దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ జీవితాలను త్యాగం చేశారని ఇందిరా గాంధీ కూడా దేశంలో తీవ్రవాదమునకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొని తన ప్రాణాలను సైతం అర్పించారన్నారు రాజీవ్ గాంధీ కూడా శాంతిని స్థాపించడానికి తన ప్రాణాలను బలిదానం చేశారని. ఇల్లు లేని పేదల కోసం పక్కా ఇళ్శను తాను శాసనసభ్యునిగా పనిచేసిన కైకలూరు నియోజకవర్గం భుజబల పట్నం గ్రామంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల గృహాలను కాలనీని నిర్మించానన్నారు. పేదవారి కోసం బ్యాంకులను జాతీయకరణ చేశారన్నారు. స్టేట్ జనరల్ సెక్రెటరీ మార్నిడి బాబ్జి స్థానిక కాంగ్రెస్ నేతలు ముందుగా ఇందిరాగాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు
