సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దీపావళి సంబరాలు ఒక మోస్తరుగా రంగురంగుల కాంతులతో పండుగ జరిగింది. గత ఆదివారం రాత్రి 7గంటల కల్లా ఇంటింటా పుష్ప విద్యుత్ దీప అలంకారాలతో, శ్రీ లక్ష్మి పూజలు తో పాటు అందమైన దీపపు వెలుగులు కొలువు దీరాయి. పెద్దలు చిన్నారుల కోలాహలంతో ఇళ్ళు లక్ష్మి కళతో సందడిగ ఉన్నాయి. ఇక బాణాసంచా కాల్పులుతో ఆకాశం రంగు రంగుల కాంతుల అలంకారాలతో ప్రత్యక శోభ తో కనపడింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఆఖరికి ‘కరోనా’ సమయంలో కూడా ఇంత నిస్తేజంగా పండుగ జరగలేదు. ‘అతివృష్టి అనావృష్టి’ లతో 2తుపానులతో భీమవరం ప్రజల దగ్గర ఆదాయం బాగా తగ్గటం, ఆక్వా తదితర వ్యాపార రంగాలు దెబ్బ తినడంతోపాటు, అన్ని నిత్యావసర ధరలతో పాటు బాణాసంచా ధరలు భారీగా పెరగటం తదితర కారణాలతో ఈసారి సామాన్యుడు పూర్తిగా వెనుక అడుగు వేశారు. కొన్ని కుటుంబాలలో దీపాలు వెలింగించారు తప్ప ఎటువంటి సందడి లేని పరిస్థితి వచ్చింది. ఎదో ఆర్థికంగా బలమైన వర్గాలు,మార్వాడీలు, బెంగాలీలు ఉన్న ప్రాంతలలో మాత్రం వేడుకలు నిర్వహించారు. మిగతా ప్రాంతాలలో గంట లోపే సందడి ముగిసింది. పట్టణంలోని పలు దేవాలయాలు తో పాటు గత సాయంత్రం, శ్రీ స్వర్ణ సాయి మందిర్, మారుతి సెంటర్ లోని శ్రీ బాబావారి మందిరాలలో దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేసారు. పట్టణంలో ఎక్కడ ప్రమాదాలు లేకుండా ప్రశాంతగా వేడుక జరగటం మంచి పరిణామం. గతంలో దీపావళి రోజు భీమవరం పట్టణంలో కాంతులు శాటిలైట్ ఫోటోలు తెలుగు రాష్ట్రాలలో అందరు వింతగా చూసేవారు.. మరి ఈసారి మాత్రం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *