సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పరిధిలో హెడ్ వాటర్ వర్క్స్ నందు క్రొత్తగా నిర్మించిన 17 ఎం‌ఎల్‌డి క్లియర్ వాటర్ మెయిను పైపు ను 2 ఎం‌జి‌డి ప్లాంట్ యొక్క సంపు కు ఇంటర్కనెక్షన్ పనులు అత్యవసరంగా జరుగుచున్నందున భీమవరం 2 టౌన్ లోని శ్రీరాంపురం ,ఏ‌ఎస్‌ఆర్ నగర్ , మరియు భీమవరం వన్ టౌన్ లోని బ్యాంకు కాలని గునుపూడి రిజర్వాయర్లు పరిదిలో గల పట్టణ ప్రాంతములలో రేపు ఆదివారం అనగా 07-01-2024 సాయంత్రం మంచినీటి సరఫరా జరగదు. కావున ప్రజలందరూ మంచినీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించవలసినదిగా మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *