సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత 2 రోజులుగా 2 టౌన్ లో ఒక రకమైన వాసనా వస్తుందని ప్రచారం జరుగుతుంది.అయితే గత ఆదివారం సాయంత్రం పెనుగాలులు గంట పాటు పట్టణం అంతటా విస్తరించడం తో ఒక రకమైన ఘాటైన రసాయన వాసన వన్ టౌన్ పట్టణం తో పాటు పట్టణం అంతటా విస్తరించింది. నేటి సోమవారం కూడా కొన్ని ప్రాంతాలలో ఈ తరహా వాసన భీమవరంలో యనమదురు కాల్వలో ఫ్యాక్టరీల నుండి ఎదో రసాయనాలు కలిశాయని దానితో ఒక రకమైన వాసన పట్టణంలో వ్యాపించింది అని, పెనుగాలులతో మొత్తం విస్తరించిందని ఈ వాసనా పిలిస్తే చిన్నారులకు పెద్దలకు ప్రమాదం అని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ వాసనా ప్రభావం తగ్గినప్పటికీ అధికారులు యనమదురు కాల్వలో ఉప కాలువలు ద్వారా .. నిజంగానే ప్యాక్టరీల వ్యర్ధాలు కలుస్తాయి కాబ్బటి.. ఒక వేళా నిషేదిత రసాయనాలు ఎంత పెద్ద మోతాదు లో కలిసాయో పరిశీలించి.. అదే నిజమైతే హద్దులు మీరుతున్న వ్యర్ధాలకు కారణమైన వారిపై, సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవలసి ఉంది. ఆరోగ్య శాఖ , పొల్యూషన్ శాఖ అధికారులు అశ్రద్ధ వహిస్తే దాని మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *