సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ కాలం నుంచి 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ కు ప్రత్యక స్తానం ఉందని మరి దీనిని అభివృద్ది చేయడానికి ప్రతి సభ్యుడు బాధ్యత తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అడ్జక్షులు కొటికలపూడి చినబాబు అన్నారు. నేడు, బుధవారం ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ జనరల్ బాడి సమావేశం నిర్వహించారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ.. భీమవరం లో ఎన్ని క్లబ్ లున్నా టౌన్ హాల్ కు ఉన్న గౌరవం ప్రత్యేకత వేరని, భీమవరంలో క్లబ్ లు మరింత అభివృద్ధి చెందాలని,అయితే తప్పులు చేయవద్దని, మంచిగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. క్లబ్ లో రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో సభ్యులంతా టౌన్ హాల్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వీకెండ్ లో ఫ్యామిలీ సభ్యులంతా క్లబ్ లకు వచ్చేలా మౌలిక వసతులను సదుపాయాలను క్రీడా మైదానలను ఏర్పాటు చేయాలని, దాని మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, యిర్రింకి సూర్యారావు, బండి శక్తశ్వర సాంబమూర్తి, కోళ్ల అబ్బులు, గ్రంధి సురేష్, కామన నాగేశ్వర్రావు, గన్నాబత్తుల శ్రీనివాస్, చెనమల్ల చంద్రశేఖర్, టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు.
