సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్నికల లో పాల్గొనే అభ్యర్థుల నామినేషన్ పర్వము రేపటి గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు, గురువారం ఉదయం 10 గంటల 38 నిమిషాలకు జనసేన అభ్యర్థిగా కూటమి మద్దతు తో పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు ఎన్నికల రేటర్నింగ్ అధికారికి తన నామినేషన్ సెట్ అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ, తెలుగుదేశం జిల్లా అడ్జక్షులు రామరాజు, మెంటే పార్ధసారధి, జనసేన జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందబాబు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 2 టౌన్ లోని మల్టిఫ్లెక్స్ కూటమి పార్టీల కార్యాలయం నుండి వాహనంపై ఉన్న అంజిబాబు కూటమి నేతలకు ఆయనకు క్రేన్ తో భారీ పుష్పమాల వేసి బైక్ లపై టీడీపీ జనసేన బీజేపీ జెండాలతో భారీ ర్యాలీగా వన్ టౌన్ లోకి ప్రవేశించింది. తదుపరి ఆర్వో కార్యాలయం కార్యాలయంలో నామినేషన్ వేసిన తదుపరి అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నేతలు క్యాడర్ తన విజయానికి అన్ని విధాలా సహకరిస్తున్నారని, భీమవరం నియోజకవర్గానికి మరోసారి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని అందరూ మంచి పాలన కోసం, ప్రశాంతమైన భీమవరం కోసం తనను బలపరచాలని, ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
