సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దసరా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని దేవి ఆలయాలలో నేటి ఆదివారం ఉదయం నుండి భక్తులు విశేషంగా శ్రీ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. గునుపూడిలోని శ్రీ పంచారామ సోమేశ్వర , శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ఉమా భీమేశ్వర, తదితర దేవాలయాలలో శ్రీ అమ్మవార్ల కు ఈ 9 రోజుల పాటు విశేష అవతార అలంకారాలుతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు బెంగాలీలు పలు చోట్ల శ్రీ కాళీ మాత విగ్రహాలను నిలబెట్టారు. ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో అత్యంత ఘనంగా ఈ ఏడాది వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 9 రోజులు పాటు 9 దేవి అవతారాలలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి నిలువెత్తు విరాట్ స్వరూపాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. నేటి ఆదివారం శ్రీ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తునారు. ఫై తాజా చిత్రంలో చూడవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *