సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లో కూటమి బలపరచిన జనసేన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జన్మదిన వేడుకలు నేడు, గురువారం స్థానిక బ్యాంకు కాలనీ లోని ఆయన నివాసనికి సమీపం లోని కల్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులకు కేక్ పంపిణి విందు ఏర్పాట్లు చేసారు. పట్టణములోని జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధ సారధి తో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది. తదుపరి అడ్వార్డ్ ట్యాంక్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు పేదలకు అంజిబాబు చేతుల మీదుగా దుస్తులు, దుప్పట్లు పంపిణి చేసారు. ఈ సందర్భముగా అంజిబాబు మాట్లాడుతూ.. మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రజా సేవకే తన జీవితం అంకితం చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యలు పరిస్కారం కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
