సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి మంగళవారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు జన్మదిన వేడుకలను అయన అభిమానులు, వైసిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం గునుపూడి స్వగృహం వద్ద, అభిమానులతో పాటు పలువురు ప్రజాప్రతినిదులు, అధికారులు సందడి ఎక్కువగా కనపడింది. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మోషేను రాజుకు బొకే అందించి జన్మదిన శుభాబినందలు తెలిపారు. ఆయనతో పాటు DCCB ఛైర్మన్ మరియు YSRCP ఉండి ఇంఛార్జి ,PVL నర్సింహ రాజు, మేడిద జాన్సన్, తోట బోగయ్య, ఏ ఎస్ రాజు వంటి నేతలు ఉన్నారు. తదుపరి ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ఆర్యవైశ్య మిత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజి ఫై భారీ ఊరేగింపు తో ఆయన వచ్చి అస్సినులు కాగా పెద్ద ఎత్తున పురప్రముఖులు అభిమానులు ఆయనకు అబినందనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకోరు తనం.. చేసే పనిపై నిబ్బద్దత.. అణుకువ .. సామాన్యుడి ప్రస్థానం నుండి ఇంతా పెద్ద స్థాయికి తెచ్చిందని పలువురు పేర్కొన్నారు. ఆయన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ సెంటర్ లో అభిమానులు కార్యకర్తలు అధికారులు పెద్ద ఎత్తున వచ్చి వారికి జన్మ దిన శభాకాంక్షలు తెలియచేశారు.పట్టణం అంతటా ఏర్పాటు చేసిన ఆయన ఫ్లక్సీ లతో పట్టణంలో పండుగ వాతావరణం కనపడింది. మన సిగ్మా న్యూస్ తరపున ఆత్మీయులు.. కొయ్యే మోషేను రాజు గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము..మీ.. సిగ్మా ప్రసాద్..
