సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు, బుధవారం భీమవరం నియోజకవర్గం లో వాడవాడలా ఘనంగా జరిగాయి. స్థానిక త్యాగరాజు భవనంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా ఎస్పీ యూ రవి ప్రకాష్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లు ముందుగా నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనేక మంది వైసిపి అభిమానులు రక్త దానం చేసారు. అనంతరం భారీ కేకు కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి, మహిళలకు పలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ .. సీఎం జగన్ ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తారని, సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా కానుక, జగనన్న విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నవరత్న పథకాలను రాష్ట్రంలో 85 శాతం కుటుంబాలకు ప్రయోజనాలు దక్కాయన్నారు. .. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి సభ్యులు కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కోడె యుగంధర్, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, వైసిపి జిల్లా మహిళా అడ్జక్షురాలు గూడూరి ఉమ బాల ,తోట బోగయ్య, ముల్లి నరసింహమూర్తి, కొల్లి ప్రసాద్, బొక్క గోపి, ఏ ఎస్ రాజు, తదితర నేతలు సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
