సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భీమవరంలో జరిగిన పలు వేడుకలలో , రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ,మెంటే పార్ధసారధి, మెఱగాని నారాయణమ్మ పాల్గొన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో జరిగిన వేడుకలలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జనసేన చినబాబు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారికి రూ 5 లకే భోజనం అందిస్తు సంక్షేమాన్ని, విజన్ అందిస్తున్నారని , భావి తరాలకు ఆయనే ఆదర్శం అని వక్తలు అన్నారు. భీమవరం పాత బస్టాండ్ వద్ద టీడీపీ నేత కోళ్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించి 1000 మందికి భోజనం అందించారు.
