సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యకర్తలు భీమవరం పట్టణం అంతా ఆయన ఫ్లెక్సీలు పెట్టి శుభాకాంక్షల సందడి చేసారు. అయన కార్యాలయంలో జిల్లా నుంచి నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టిన రోజు సందర్భంగా నాయకులు బండి రమేష్ కుమార్ , గంగాధర్ , బన్ను ప్రసాద్ , సత్తివాడ నవీన్ పట్టణంలోని స్థానిక జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.భీమవరం నియోజకవర్గం నాయకులు బండి రమేష్ కుమార్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలెంద్రా, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, Mptc లు తాతపూడి రాంబాబు, ఆరేటి వాసు, అతికెల ఆంజనేయ ప్రసాద్, ఉండవల్లి శ్రీను, తదితర నాయకులు మరియు ఉంగుటూరు, ఉండి, నిడదవోలు, భీమవరం నియోజకవర్గాల నుండి జనసైనికులు, వీరమహిళలు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేశారు.
