సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నవరంలో మొదలయిన పవన్ కళ్యాణ్ మొదటి విడుత వారాహి యాత్ర భీమవరంలో ముగుస్తున్న విషయం తెలిసిందే.. వారాహి యాత్ర ముగింపు దశగా నరసాపురం నుండి భీమవరం అభిమానుల ఘన స్వాగతాల మధ్య మత్యపురి, తాడేరు రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకోవడం నేడు, మంగళవారం ఉదయం 7గంటల నుండి ఆయన బస చేసిన నిర్మలాదేవి పంక్షన్ హాలు ముందు ఆయన అభిమానులు, జనసైనికుల భారీ కోలాహలం మధ్య పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలు ఇక్కడి చేరుకొంటున్నారు. స్వల్ప అస్వస్థతతో ఉన్న పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వరకు కొంత విశ్రాంతి తీసుకున్నాక స్థానిక నేతలతో, భీమవరం నియోజక వర్గంలోని ప్రజా సమస్యలు పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూన్నారు. వచ్చే ఎన్నికలలో అనుసరించవలసిన ప్యూహాలఫై సమీక్షా చేస్తున్నారు. ఇతర పార్టీల నుండి జనసేన లో చేరటానికి వస్తున్నా పలువురు నేతలతో వారు జనసేనకు చెయ్యవలసిన సేవలపై ఈ నేపథ్యంలో వారందరితో నేటి సాయంత్రం 5 న్నర గంటల నుండి పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *