సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు జన్మదిన వేడుకలు నేడు, శుక్రవారం ఉదయం జనసేన పట్టణ అడ్జక్షులు చిన్నమల్ల చంద్రశేఖర్ మరియు జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ బర్తడే కేక్ ను కోసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమెల్య అభ్యర్థి పులపర్తి అంజిబాబు, టీడీపీ పార్టీ కేంద్ర కోశాధికారి మెంటే పార్ధసారధి ప్రధాన అతిధులుగా హాజరు అయ్యారు. రక్త దాన శిబిరంలో పలువురు అభిమానులు రక్తదానం చేసారు. అన్నసమారాధన ఏర్పాటు చేసారు. అయితే చినబాబు మాత్రం ఎప్పటి లానే వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆదివారం బజారు ఇంకా పలు సెంటర్స్ లో జనసేన అభిమానులు అబినందనాలు తో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసారు.
