సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు లోకేష్ ల పల్లకి మోస్తున్నట్లు కార్టూన్ ఫ్లెక్సీలు ను వైసిపి వారు ఏర్పాటు చెయ్యాలని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జనసేన నేతలు కోటికల పూడి గోవిందరావు (చినబాబు)ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ తదితర అధికారులకు వినతిపత్రం అందచేసిన విషయం విదితమే. అధికారులు నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా జనసేన పార్టీ తదుపరి కార్యచరణ చర్యలకు సిద్ధం అంటూ నేడు, గురువారం భీమవరం లో జనసేన పార్టీ (చినబాబు ఇంటి వద్ద) కార్యాలయం వద్ద పార్టీ నేతలు సీఎం జగన్ అవినీతి పరుడు అంటూ అతనిని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్లక్సీ ని ఏర్పాటు చెయ్యడంతో పోలీసులు రంగంగాలోకి దిగారు. విమర్శలు సెటైరికల్ గ ఉండాలి కానీ సాక్షత్తు ముఖ్యమంత్రి ని అవినీతి పరుడు అని కామెంట్స్ తో ఫ్లెక్సీ లను కట్టడంపై జనసేన నేతల తీరును తప్పుపడుతూ వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనసేన చినబాబు ను నేటి ఉదయం 6గంటలకు పట్టాన పోలీసులు ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకొన్నారు.చినబాబును పోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారని జనసేన రాష్ట్ర నేత కనకరాజు సూరి ..మన సిగ్మాన్యూస్ కు తెలిపారు. దానిని అడ్డుకోవడానికి వచ్చిన జనసేన కార్యకర్తలతో ఉద్రిక్తత తలెత్తింది. దీనికి నిరసనగా జనసేన కార్యకర్తలు చినబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్ వద్ద జగన్ పాలనకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తదుపరి స్థానిక భేమేశ్వర స్వామి గుడివద్ద జనసేన పార్టీ కట్టిన ఫ్లెక్సీ ని పోలీసులు తొలగించడానికి ప్రయత్నించడంతో దాన్ని అడ్డుకొనేందుకు జనసేన కార్యకర్తలు అక్కడ మోహరించి తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేసారు. అయినప్పటికీ పోలీస్ అధికారులు గంటకు పైగా అక్కడే వేచి ఉండి జనసేన పార్టీ పెద్దలకు పలు సూచనలు చేసి సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ జన సైనికుల నినాదాలు మధ్య ఫ్లక్సీ లను తొలగించారు.నేటి మధ్యాహ్నం జనసేన చినబాబు మీడియా సమావేశం కు పిలుపు నివ్వడం తాజా పరిణామం.
