సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించాయి. పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసారు.సాహసం తన ఊపిరి గా ..మంచివాళ్లకు మహా మంచివాడిగా, సినీరంగంలో రారాజు గా బ్రతికిన మహా మనిషి ‘సూపర్ స్టార్’ కృష్ణ అని, ఆయన గతంలో ఏలూరు ఎంపీగా పనిచేసిన కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. హీరో కృష్ణ జయంతి సందర్భంగా ఏలూరు జన్మ భూమి పార్కులో ఏర్పాటు చేసిన కృష్ణ కాంస్య విగ్రహాన్ని( అగ్ని పర్వతం సినిమాలో జమదగ్ని గెటప్ లో.. ఈ సినిమా ఏలూరులో 175 రోజులు ఆడింది) అభిమానుల సమక్షంలో ఆయనఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణ అభిమానులు సేవాకార్యక్రమాల్లో భాగస్వా ములై కృష్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. నగర మేయరు షేక్ నూర్జహాన్, కృష్ణ బావమరిది, సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణమూర్తి , అంబికా కృష్ణ, ఉషా పిలింస్ బాలకృష్ణ తదితరులు మాట్లాడారు. కృష్ణ అభిమాని అయిన డాక్టర్ దిరిశాల వరప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *