సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం కాస్మో క్లబ్ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళ విద్యావంతు రాలైతే ఆ కుటుంబం మాత్రమే కాకుండా చుట్టు పక్కల సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని, మహిళలు తమ కష్టాలను, సమస్యలను ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవాలన్నారు. ఒకప్పుడు ఇంటికి పరిమితమైన మహిళ ఈరోజు విద్య, వైద్య, క్రీడ రంగాలకే పరిమితం కాకుండా అంతరిక్ష యానం చేసే స్థాయికి మహిళలు ఎదిగారని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే సృష్టి లేదని, ఈ సృష్టికి మూలం, భారత రాష్ట్రపతిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళలను ఎంపిక చేసుకోవడం ఎంత గొప్ప విషయమని అన్నారు. ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ దశాబ్దాల క్రితం మహిళలను పారిశ్రామిక రంగాలలో రోజుకు 18 గంటలు పని చేయించి శ్రమ దోపిడి జరిగేదని, మహిళలను హీనముగా చూసేవారని ఇప్పుడు చెతన్యం వచ్చిందని అన్నారు. రాష్ట్ర ఏపీ ఏఎస్ సిపిసి చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ త్వరలో ఉచిత బస్సు సర్వీస్, అమ్మకు వందనం వంటి పథకాలను మహిళలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణకుమారి, ట్రైనీ డిఎస్పి కె మానస తదితరులు ప్రసంగించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్స్ సంబంధించిన వారిలో అత్యుత్తమ సేవలను అందించిన మహిళలను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలుగా రూ.40 కోట్లు, 701 మంది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలుగా రూ 95.59 కోట్లు, పిఎం విశ్వకర్మ పథకం కింద రూ 75 లక్షలు, సహాయ సహకార సంఘాలకు రూ.15 కోట్లు నమునా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *