సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతీయ లోక్ అదాలత్ లో కేసుల రాజీకి తీసుకోవలసిన చర్యల గురించి శనివారం భీమవరం లోని కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీసు .అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో… వచ్చే డిసెంబర్ నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు ఎక్కువగా రాజీ చేయుటకు కృషి చేయాలని, రాజీ యొక్క ప్రాముఖ్యతను కక్షిదారులకు తెలియజేస్తే స్వచ్చందంగా రాజీకి వస్తారని, ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత న్యాయమూర్తి దృష్టికి తీసుకురావచ్చని” భీమవరం 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ M.A. సోమశేఖర్ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ శ్రీ G. సురేష్ బాబు, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ D. ధనరాజు, భీమవరం 1వ పట్టణ, 2వ పట్టణ, రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ళ, వీరవాసరం, పాలకోడేరు, భీమవరం ఎక్సైజ్, ఆకివీడు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
