సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు అనారోగ్యంతో గత , గురువారం సాయంత్రం మృతి చెందిన నేపథ్యంలో గత శుక్రవారం భీమవరంలో ఆయన అంత్యక్రియలు పూర్తీ అయ్యిన నేపథ్యంలో నేడు, శనివారం ఉదయం నుండి భీమవరం లోని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో స్వర్గీయ భూపతిరాజు బాపిరాజు చిత్ర పటానికి పుష్పాలతో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ప్రముఖులు కూటమి నేతలు, పశ్చిమ గోదావరి జిల్లా లోని అందరు ఎమ్మెల్యే లు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున నేతలు హాజరు అయ్యి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు కు సంఘీభావం పరామర్శ తెలియజేసారు.
