సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఏ ప్రధాన సెంటర్లో నైనా సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై బైకులు, మోటారు వాహనాలు ఆపుతున్నారంటేనే.. వాహనదారులలో ఒక ఆందోళన మొదలవుతుంది. ఇక ప్రతి రోజు పలువురు ఉల్లం ఘనలకు పాల్బడ్డారని పెద్ద మొత్తం లో జరిమానాలు కట్టడం షరా మాములుగా మారింది. ఈ ట్రాఫిక్ కేసులలో ఏక్కువగా నూటికి 80 శాతం డ్రైవిం గ్ లైసెన్స్ లు లేకుం డా బైక్లు నడపడం సర్వ సాధారణమైపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఈ సమస్య కు భీమవరం పట్టణ పోలీసులు ఒక పరిష్కా రం కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా డ్రైవిం గ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చే లా ఏర్పాట్లు చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్న ట్లు రవిప్రకాష్ చెప్పా రు. ఈ విధానం ద్వారా జిల్లావ్యా ప్తంగా 20 వేల మందికి లైసెన్స్ లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్ప టికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్ లు జారీ చేసినట్లు చెప్పారు. భీమవరం జిల్లాకేం ద్రం గా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కా రానికి పలు మార్గాలు.. అనే అంశంపై పట్టణం లోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నా ర్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యా ర్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం అని ప్రకటించారు.
