సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వైసిపి నేతలు నేడు శుక్రవారం సాయంత్రం స్థానిక బస్సు స్టాండ్ వద్ద ఈనాడు పేపర్లు దగ్ధం చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు చంద్రబాబు ను సీఎం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిరోజూ తన పత్రికలో తప్పుడు వార్తలు రాస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఉద్రిక్తలు రెచ్చగొట్టిన పట్టాభి ని పోలీసులు కొట్టారని పట్టాభి కి గాయాలు అంటూ ఆ పత్రిక మొదటి పేజీ హెడ్ లైన్స్ లో వేసిన వేసిన ఫోటోలు ఎప్పటివో వేసి ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారని , తరువాత నాలిక కరుచుకొన్నారని, రామోజీరావు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో భీమవరం ఎఎంసి చైర్మన్ కోటిపల్లి బాబు, వైసిపి నేతలు తోట భోగయ్య, గూడూరి ఉమాబాలు కోడె విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, మానేపల్లి నాగన్నబాబు, నల్లం రాంబాబు, జవ్వాది సత్తిబాబు, పేరిచర్ల సత్యనారాయణరాజు, చెల్లబోయిన సూర్యప్రకాష్, తానాల రామకృష్ణ, నల్లం రఘు, పెచ్చెట్టి ప్రసాద్, గాదిరాజు రామరాజు, మద్దుల శ్రీను,, కోయ తాతాజీ, ముత్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
