సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ‘వైద్యో నారాయణ హరి’ అన్న నానుడి నిజం చేస్తూ డబ్బు కోసం కాకుండా కేవలం రోగి ఆరోగ్యం కాపాడటానికి నిబద్దత తో వైద్య వృతి ని నిర్వహిస్తూ ఎందరికో స్వస్థత చేకూర్చిన భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, టిబి,ఛాతి వ్యాధుల నిపుణులు డాక్టర్ కె వి ఏ గంగాధర్ రావు నేడు, సోమవారం ఢిల్లీ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన డాక్టర్ గంగాధర్ రావు ముందుగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం దేశ రాజధాని ఢిల్లీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు, బందువులు తీసుకువెళ్లారు అయినప్పటికీ కూడా ఎందరికో ప్రాణదానం చేసిన ఆయన మృత్యువుతో పోరాడుతూ మ్రృతి చెందారు. గత నాలుగు దశాబ్ధాల కాలంగా భీమవరం పట్టణంలో చాల తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ.. రోగి బాధ సగం మరచిపోయేలా అతని స్నేహితుడుగా చలాకీగా గమ్మత్తుగా మాట్లాడే డాక్టర్ గంగాధర్ పేదల వైద్యులుగా ఖ్యాతి గాంచారు..అటువంటి దేవుడులాంటి గంగాంధర్ డాక్టర్ ఇక లేరు అన్న విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది, అభిమానులు, ఆయన వద్ద వైద్య సేవలు లు పొందిన వేలాది ప్రజలు లో తీవ్ర విషాదం అలముకుంది.
