సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికీ అత్యంత ప్రియమైన మాసంగా భాసిల్లుతున్న ధనుర్మాసం నేటి సోమవారం నుండి ప్రారంభం అయ్యింది. నేటి ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా భీమవరం లోని అన్ని ప్రముఖ శ్రీ విష్ణు, శ్రీ వెంకటేశ్వర ఆలయాలలో,కాళ్ళకూరు స్వయం భూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోదాదేవిపూజలు దీపారాధనలు ఈ మాసంలో ఏర్పాటు చేసారు. కలియుగ వైకుంఠం లో రేపటి . మంగళవారం (17వ తేదీ) నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. నెల రోజుల పాటు స్వామివారికి తిరుప్పావైతో మేల్కొలుపు ఉంటుంది. అలాగే ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేధ్యాలుగా దోశ‌, బెల్లం దోశ‌, సీరా, పొంగ‌ల్ వంటి ప్రసాదాల‌ను నివేదిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *