సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి భీమవరం పురపాలక సంఘం పరిధిలో 100% ప్లాస్టిక్ నిషేధం అమలు కొరకు నేటి మంగళవారం సాయంత్రం భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు కమిషనర్, కే రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్లకు, శానిటేషన్ సెక్రటరీలకు మరియు హోల్ సెల్ షాపు డీలర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులపై పూర్తిస్థాయి నిషేధం ఉన్న కారణంగా విక్రయదారులు సదరు నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలు జరపరాదని నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని వాటి అమ్మకాలు మాత్రమే జరపాలని, ప్రభుత్వం వారు నిషేధించిన ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు క్రయవిక్రయాలు జరిపిన యెడల వారికి పెద్ద మొత్తంలో పెనాల్టీలు విధించుటయే గాక వారి వారి షాపు యొక్క లైసెన్స్ క్లోజ్ చేయబడునని హెచ్చరించారు. చెత్తను వారి షాప్ బయట గాని రోడ్లమీద గాని పారవేసినట్లు గుర్తించిన షాపులో చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోలేకపోయినా వారికి పెనాల్టీలు విధించబడునని తెలియజేయడమైనది ఈ విషయంలో భీమవరం పట్టణ ప్రజలందరూ సహకరించి భీమవరం పట్టణంలో స్వచ్ఛతకు పాటుపడవలసిందిగా విజ్జ్ఞప్తి చేసారు.
