సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పరమ శివునికి ఇష్టమని పురాణాలూ పేర్కొంటున్న కార్తీకమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. ఇక సోమవారం, ఏకాదశి, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి రోజులు మరింత ప్రభావవంతమైనవిగా భక్తులు భావిస్తారు. వీటిలో ఒకటైన పౌర్ణమి ఆదివారమే కావడంతో పూజలు, అభిషేకాలు, దీపారాదనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. నేడు, ఆదివారం నోములు పండుగ పేరుతొ వ్రతాలు ఆచరిస్తునారు. భీమవరం పట్టణంలో పలు గృహాలలో పిండి వంటల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కూడా కావడంతో నేటి ఉదయం నుంచి కుటుంబసభ్యులు తమ కుటుంబ, వంశ క్షేమం కోసం రాత్రివరకు ఉపవాస దీక్షలు చేస్తున్నారు… సాయంత్రం ప్రత్యేక పూజలు.. వాయనాలు ఇవ్వడం.. ప్రసాదాన్ని ఇరుగుపొరుగు వారికి పంచడం ఆనవాయితీ. పౌర్ణమి రోజున కార్తీక దీపాలు వెలిగించడం,చంద్రుని అస్సిసుల కోసం జలాలలో వదలటం చాలా మంచిదని భక్తులు భావిస్తారు. ఆవునేతి తో వెలిగించే ఈ దీపాల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గి వాతావరణం శుద్ధి అవుతుందని, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. కాగా కార్తీక పౌర్ణమి పూజలకు భీమవరంలోని ప్రముఖ ఆలయాలన్నీ సిద్ధమయ్యాయి. ముఖ్యముగా పంచా రామం లోని చంద్ర పుష్కరిణి , శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, యనమదురు లోని స్వయం భువుడు శ్రీ శక్తేశ్వర స్వామి దేవాలయాల వద్ద వేలాది మహిళల దీపారాధన, అంఖండ దీపారాధనలు లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
