సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో భీమవరం చుట్టు పక్కల ప్రాంతాల్లో నాయకులు పర్యటించి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల అర్నాబ్, మురుసు తుఫాన్ లతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ జరిపించాలని, వరికి 50 వేలు, వాణిజ్య పంటలకు 75 వేలు, ఉద్యానవనం పంటలకు లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని, ఖరీఫ్ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ల ధాటికి వరి, ఆక్వా, కొబ్బరి, అరటి, తమలపాకు, తోట పంటలు, కూరగాయల పంటలతో సహా తుడిచి పెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నష్టం జరిగినా ఎన్యమరేషన్ జరగకపోవడం దారుణమని, కేంద్ర, రాష్ట్ర బృందాలు పర్యటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమరావు మాట్లాడుతూ.. చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆక్వా కు వారం రోజులు విద్యుత్ లేకపోవడంతో చెరువుల్లో చేపలు రొయ్యల తేలియాడాయని కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ఆచరణలో లేవని ఆయన విమర్శించారు. AP రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకట్రావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.సీతారాంప్రసాద్ తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *