సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో రేపు మంగళవారం జరగవలసిన జనసేన అధినేత పవన్ పర్యటన వాయిదా పడిందని పార్టీ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ కొటికలపూడి గోవిందరావు తాజా గా సిగ్మా న్యూస్ కు తెలిపారు. రేపటి మంగళవారం భీమవరం పట్టణానికి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు జనసేనాని పవన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా స్థానిక వైసీపీ పెద్దలు అధికారులపై వత్తిడి తెస్తున్నారని జనసేన కీలక నేతలు చెబుతున్నారు. వివరాలలోకి వెళితే.. భీమవరం విష్ణు కాలేజీలోని హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. పోలీసు శాఖ, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అయితే ఆర్అండ్‌బీ శాఖ మాత్రం కొన్ని అభ్యన్తరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ హెలిప్యాడ్‌లో ఇదే చోట దిగారు. అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు ఏమి లేవని. ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
