సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు ముఖ్య భూమిక అని, ఆ పండుగల్లో సంక్రాంతి అతి ప్రదనమైనదని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సంక్రాంతి సంబరాల పోస్టర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. సంక్రాంతి, దసరా, ఉగాది దీపావళి పండుగలను గత 36 ఏళ్లుగా వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ..భీమవరంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 11 వ తేదీ వరకు వివిధ పాఠశాల కళాశాలలో అన్ని వర్గాల వారితో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని, గంగిరెడ్లు, డప్పుల వాయిద్యాలు, రంగవల్లులు, గోబిళ్ళ పేరంటాలు బోగి పండగ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, అరసవల్లి సుబ్రమణ్యం, భట్టిప్రోలు శ్రీనివాసరావు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
