సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గత మంగళవారం రాత్రి 8 గంటల నుంచి పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు బంద్‌కు వెళుతున్నారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాలలో వాహనదారులలో కలకలం రేపింది.దానితో భీమవరంలో గత రాత్రి పెట్రోలు బంకులన్నీ గత మంగళవారం రాత్రి వాహనాల రద్దీతో కిటకిట లడాయి. కొందరు తమ బైక్ లకు ముందస్తు జాగ్రత్తగా వెయ్యి రూపాయలవరకు పెట్రోల్ కొట్టించేసారు. ఇక పెట్రోల్ కారులు అయితే ఫుల్ ట్యాంక్ లు చేయించారు. నేటి బుధవారం ఉదయం కూడా పెట్రోల్ బంక్ లు వాహనాలతో రద్దీగా ఉన్నాయి, నిజానికి గత రాత్రి తెలంగాణలో పెట్రోల్ కోసం ఇప్పటికే జనం అవస్తలు పడుతున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. దానితో ఏపీలో కూడా ఇక చూసుకోండి..ఈ ప్రచారాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఖండించారు. అలాంటి సమాచారం ఏదీ రాలేదని అన్నారు.
