సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా వాడవాడలా నిర్వహించారు. స్థానిక PSM గర్ల్స్ హైస్కూల్ లతో పాటు స్థానిక ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన భీమవరం ఆదివారం బజారు సెంటర్ లోని మావుళ్ళమ్మ దేవస్థానం వద్ద పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలోని ప్రలువురు వ్యాపార ప్రముఖులు రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే పునాది అయ్యిందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం, మండలి సంఘం సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.
