సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మందు కు కొదవలేదు. వేళాపాళా లేకుండా త్రాగి రోడ్ల పైబడి దోళ్లేవారి సంఖ్యా కొత్త కాదు. అయితే కొద్దీ రోజుల క్రితం బాగా త్రాగిన మందుబాబులు భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్స్‌పై దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్దీ రోజుల క్రితం గత నెల లో దీపావళి రోజు ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి నడిరోడ్డుపై కూర్చుని రాకేష్ అలియాస్ సాయి, నజీరుద్దీన్, నూర్ భాషా అనే ముగ్గురు యువకులు మద్యం సేవిస్తుండగా అటుగా వచ్చిన బీట్ కానిస్టేబుల్స్.. మందు బాబులను ఇక్కడనుండీ వెళ్లాలని నడిరోడ్డుపై తాగడం ఏంటని? ప్రశ్నించడంతో ఆ యువకులు పోలిసుల మీద రెచ్చిపోయి దాడి కి పాల్బడి కొట్టిన ఘటన స్థానిక సిసి ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. పైగా వారి దౌర్జన్యాన్ని కవర్ చేస్తున్న వెంప ప్రసాద్ అనే కానిస్టేబుల్ సెల్ ఫోన్ ని కూడా వారు నేలకేసి కొట్టారు. యువకుల దాడిలో కానిస్టేబుళ్లు గాయపడి ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. అనంతరం జరిగిన ఘటనను పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఏ కారణం చేత ఇంతకాలం పట్టుకోలేక పోవడం గమనార్హం. మరి ఏ కారణం చేతనో 20 రోజులుగా ఈ ఘటన వెలుగులోకి రాకుండా పోయింది. మరి పోలిసుల పరిస్థితే ఇలా ఉంటె? ( ఫై ఫోటో A I కల్పిత మైనది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *