సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పేదవారికి మధ్యతరగతి విద్యార్థులకు ఖరీదయిన వైద్య విద్య ను దూరం చేసేలా మెడికల్ కాలేజీలను అధిక పీజులు వసూళ్లు చేసే ప్రవేటు యమాన్యాల పరం చెయ్యాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకోవాలని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ శ్రేణువులకు పిలుపునిచ్చారు . ఈనెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమము విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం చేసి ఇచ్చిన కూడా వాటిని నిర్వహించే సత్తాలేని కూటమి ప్రభుత్వం తమ సంబంధీకులకు కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కట్టబెట్టి ప్రవేటు పరం చేస్తుందని దీనిని యువత ప్రజలు అడ్డుకోవాలని కోరారు. దీనికోసం వైసీపీ కోటి సంతకాల సేకరణ, ప్రజాఉద్యమం కు ప్రజలు నుండి మంచి స్వాందన వస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *