సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఆదివారం తెల్లవారు జామునుండి భారీ వర్షాలు పడుతున్నాయి, ముఖ్యంగా భీమవరం, తాడేపల్లి గూడెంలో నేటి ఉదయం 6 గంటల నుండి పలు దఫాలుగా ఉరుములు, మెరుపులు, పిడుగులుతో భారీ వర్షం పడింది. విద్యుత్తూ సరఫరా కు పలు అడ్డంకులు ఏర్పడి పలుమారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు, భీమవరం పట్టణం శివారులలో ఉదయం 8 గంటల నుండి భారీ పిడుగులు పడ్డాయి, ఆ పిడుగులా శబ్దానికి , మంచి కాంతితో విద్యుత్తూ ప్రసారానికి పలు ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు, కంప్యూటర్స్ కరెంట్ సరఫరా లేకపోయిన దెబ్బతినడం విశేషం. ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు, ప్రధాన రోడ్డులు కూడా జలమయ్యాం అయ్యాయి ఉత్తరాంద్ర తో పాటు పలు ప్రాంతాలలో ఇదే తరహా వర్షాలు నిన్నటి నుండి పడుతున్నాయి. రేపు సోమవారం కూడా చల్లటి వాతావరంతో పాటు వర్షం పడే అవకాశం ఉంది.
