సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సమాజ సేవ చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలవాలని, క్లబ్ లు మంచి మంచి సేవలు చేయాలని చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు, రామరాజ భూషణ్ సాహిత్య పరిషత్ కార్యదర్శి రాయప్రోలు భగవాన్ అన్నారు. స్థానిక ప్రవేటు కన్పరెన్స్ హాల్లో మార్నింగ్ కాఫీ క్లబ్ ఐడెంటి కార్డ్స్ ను భగవాన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ క్రేజీ క్లబ్ గా మార్నింగ్ కాఫీ క్లబ్ పేరు సాధించిందని, స్నేహితుల మధ్య స్నేహ భావం పెరగడంలో ఇటువంటి క్లబ్ ఎంతో దోహదం పడుతున్నాయని అన్నారు. 3 ఏళ్లుగా మార్నింగ్ కాఫీ క్లబ్ చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు మాట్లాడుతూ మార్నింగ్ కాఫీ క్లబ్ 2021లో ప్రారంభించామని, 3 ఏళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవాతాత్పరులను గుర్తించి సత్కరించడం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.అనంతరం సభ్యులకు ఐడెంటీ కార్డులను అందజేశారు. భగవాన్ ను మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో మంతెన రామ్ కుమార్ వర్మ, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, కారుమూరి సత్యనారయణ మూర్తి, గుండు కిషోర్, కోట్ల నాని, కురిశేటి సతీష్, కారుమూరి బదిరి, తదితరులు పాల్గొన్నారు.
