సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్లో నేడు, శనివారం మిని స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, వ్యాయామం వల్ల ఆరోగ్యాంగా ఉంటామని అన్నారు. ఆరోగ్యం అన్ని సంపదల కంటే గొప్పదని, ఆరోగ్యంగా ఉంటే మనిషి ఏదయినా సాధించగలరని అన్నారు. జిల్లా బాడీ బిల్డింగ్ జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజర్ వలవల ఫణి మాట్లాడుతూ 55, 60,65,70, 75,80,85 కేజిల కేటగిరిలో పోటీలను నిర్వహిస్తున్నామని, ఛాంపియన్ అఫ్ ఛాంపియన్ కు రూ 25 వేలు ప్రైజ్, అన్ని కేటగిరిలోని మొదటి మూడుస్థానంలోని విజేతలకు బహుమతులు అందజేసామని అన్నారు. కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ వైస్ ప్రెసిడెంట్ పత్తి సురేష్, జిల్లా ప్రెసిడెంట్ కఠారి రవిశంకర్, సెక్రటరీ షేక్ ఖాసీం,కూటమి నేతలు కోళ్ల నాగేశ్వర్రావు, చెనమల్ల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, బండి రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
