సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ చుండూరు మల్లేశ్వరి ఏపీ మెడికల్ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డి ఎన్ ఆర్ అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మరియు ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు డాక్టర్ చుండూరి మల్లేశ్వరి గారిని ఘనంగా సత్కారించారు . డి ఎన్ ఆర్ అసోసియేషన్ జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ గత కొంతకాలంగా భీమవరం పట్టణం లో ఉంటూ ప్రజలకు యంతగానో నిస్వార్ధంగా వైద్య సేవలు అందిస్తున్నటు వంటి ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ చుండూరి మల్లేశ్వరి అని అన్నారు . ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అందుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈ పదవిని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు గారు మాట్లాడుతూ మన పశ్చిమగోదావరి జిల్లా లో ఇలాంటి పదవిని అందుకున్న మొదటి వ్యక్తి డాక్టర్ చుండూరి మల్లేశ్వరి అని డి ఎన్ ఆర్ అసోసియేషన్ తరుపున శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *