సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో సంక్రాంతి కానుకగా విడుదలయిన గుంటూరు కారం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం కేవలం 10 రోజులకు నేటి ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ కల్లెక్షన్స్తో కలపి సుమారు 93 లక్షలకు చేరుకొంటుంది. మొత్తం 2వారాలకు కోటి రూపాయలు కలెక్షన్స్ అధిగమించే అవకాశం ఉంది. భీమవరంలో 7 సినిమాలు కోటి రూపాయలు కలెక్షన్స్ సాధించిన ఏకైక హీరోగా ‘సూపర్ స్టార్’ మహేష్ రికార్డు సృష్టిస్తున్నాడు.. ‘భరత్ అను నేను’ సినిమాతో మొదలు పెడితే వరుస రిలీజ్ అయిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారువారి పాట, గుంటూరు కారం 5 సినిమాలు కూడా వరుసగా కోటి రూపాయలు పైగా కలెక్షన్స్ సాధించడం అరుదయిన రికార్డు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గుంటూరు కారం ఇప్పటికే 5న్నర కోట్ల కలెక్షన్ సాధించినట్లు సమాచారం. ఇక మరో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం నమోదు చేస్తున్న.. ‘హనుమాన్’ సినిమా కూడా నేటి ఆదివారం కూడాకలపి భీమవరం మొత్తం మీద 10 రోజులకు 65లక్షల కలెక్షన్ పైగా వసూలు చేస్తుంది . ఈ సంక్రాంతి పోటీపడి విజయాలు సాధించిన ఈ రెండు సినిమాల దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ వర్మ ఇద్దరు దర్శకులు భీమవరంకు చెందినవారు కావడం పోటాపోటీగా ఇద్దరు సంక్రాంతి విజేతలు అయ్యి భీమవరం బ్రాండ్ గుర్తింపు ను మరింత పెంచారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్, భీమవరం బ్రాండ్ ప్రభాస్ సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 750 కోట్ల వసూళ్లతో పాటు భీమవరం మొత్తం మీద సుమారుగా 1 కోటి 45 లక్షల కలెక్షన్స్ సాధించడం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *