సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2025 ఏడాది ముగింపుగా 2 రోజుల ముందు శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో రేపు, మంగళవారం భీమవరం పట్టణంలో అన్ని వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వారి దర్శనాల కోసం నేటి తెల్లవారు జాము 5.30గంటలనుండి మద్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 5.30గంటల నుండి 7.30 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డు లో శ్రీ వెంకటేశ్వర మందిరంలో, జేపీ రోడ్డు లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మరియు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోమరియు స్వయం భువుడు కాళ్ళకూరు శ్రీ వెంకటేస్వర స్వామి దేవాలయం,లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఉదయం 9గంటల నుండి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష చామంతుల పూజలు , ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసాద వితరణలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు సిగ్మా న్యూస్ కు తెలిపారు.
