సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో అటల్ బిహారి వాజపేయ్ 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో సుపరిపాలయాత్ర విజయవంతంగా చేస్తున్న బీజేపీ రాష్ట్ర అడ్జక్ష్యులు మాధవ్ గారికి నా ధన్యవాదాలు.. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు భూపతిరాజు శ్రీనివాస వర్మను MPగా గెలిపిస్తే ఆయన మోడీ మన్ననలు పొంది కేంద్రమంత్రిగా అద్భుతంగ పనిచేస్తున్నారు. ఇక్కడ భీమవరానికి ప్రత్యేకత ఉంది. ఈ పట్టణంలో ఉండే సంపద ఉన్నా.. ఇక్కడి ప్రజలలో పల్లెల్లో ఉండే ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అతిధి గౌరవాలు కూడా ఉన్నాయి అటువంటి భీమవరంలో వాజ్ పేయ్ విగ్రహం ఆవిష్కరణ లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. వాజ్ పేయి 3 సార్లు ప్రధానిగా చేసిన మొదటి సారి 13 రోజులు ప్రధానిగా చేసినా.. ఆతర్వాత ఒక్క ఓటుతో పదవి పోతుందని చెప్పినా.. విలువలుకు కట్టుబడి ఉన్నారు.అణుశక్తి దేశంగా భారతదేశాన్ని నిలిపారు అటువంటి ఉన్నత విలువలు ఉన్న మహనీయుడి స్ఫూర్తిగా నేను పనిచేస్తాను అన్నారు.
