సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఇంగ్లిష్ ఏడాది లో సంక్రాంతి పండుగలకు ఆహ్వానం పలుకుతున్న వేళా నేడు, శుక్రవారం పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడం తో నేడు, సోమవారం భీమవరం పట్టణంలో అన్ని వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్షి, శ్రీ పద్మావతి సమేత శ్రీ వారి దర్శనాల కోసం నేటి తెల్లవారు జామునుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ భారీ క్యూ లైన్ లలో నిలబడి దర్శనములు చేసుకోవడం జరిగింది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు , ప్రసాద వితరణలు ఏర్పాటు చేసారు. స్థానిక జేపీ రోడ్డు లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం , కాళ్ళకూరు లోని స్వయం భువుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేలాది భక్తులతో పోట్టెత్తిపోయింది. ఈ ముక్కోటి నాడు వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు లక్ష్మి సమేతుడై ఉత్తర ద్వారం వైపు తిరిగి ఉంటారని తనను తలచుకొన్న భక్తుల కోరికలను వెంటనే అనుగ్రహిస్తాడని భక్తులలో విశేషమైన నమ్మకం.. అందుకే ఎంతటి క్యూ లైన్ ఉన్నపటికీ పవిత్ర భావనతో నిలబడి ఉత్తరం వైపు నుండే వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం విశేషం..
