సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక టౌన్ హాల్లో నేటి, సోమవారం సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భీమవరం నియోజకపరిధి లోని ఎంపీటీసీలు, జడ్పిటిసి లతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలలో సీఎం జగన్, ఎంపిక చేసిన అభ్యర్థులు కౌరు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ లు ఈనెల 13న జరిగే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, మీ సహకారం కావాలని ఆయన స్పష్టం చేశారు. నేడు వైసీపీకి పూర్తి మెజార్టీ ఉందని, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేదని అయినప్పటికీ కూడా వైసీపీకి సహకరించకుండా విశ్వసనీయత లేకుండా తెలుగుదేశం నామినేషన్ లు వేయించిందని విమర్శించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసిపి తరపున ఎమ్మెల్సీల అభ్యర్థులుగా నిలబడిన కౌరు శ్రీనివాస్ ను, వంకా రవీంద్రనాథ్ లను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నిన ఫలితం ఉండదనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు కౌరు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ విజయానికి అండగా నిలబడాలని కోరారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు,భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, పాలకొల్లు జడ్పిటిసి నడపన సూర్యనారాయణ, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *