సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి కార్తీకమాసం సందర్భంగా నేడు, బుధవారం శ్రీశైలం నుండి వచ్చిన శ్రీ భ్రమరాంభిక మల్లికార్జునస్వామి వారి రధ యాత్ర కార్యక్రమం పట్టణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం సిబ్బంది మరియు అర్చకులు పాల్గొన్నారు. మరియు భీమవరం ప్రముఖులు ఉద్దరాజు ఆనందరాజు, మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు ఇక శ్రీ మావుళ్ళమ్మవారి భక్తులకు సుమారు గత 12 సంవత్యరములు పైబడి నాణ్యమైన ఆహారము భక్తులకు నిత్యాన్నదాన వితరణ జరుగుచున్నది అని నేడు, బుధవారం ఆలయ నాణ్యతను విచారిస్తు I C L సంస్థ I S O ధ్రువీకరణను మంజూరు చేసి అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని తమకు అందజేశారని సహాయ కమిషనర్ మరియు దేవాలయ కార్యనిర్వహణాధికారి వారు బుద్ధ మహాలక్ష్మి నగేష్ హర్షం వ్యక్తం చేసారు.
