`సిగ్మాతెలుగు డాట్ ఇన్ : భీమవరంలో ఈనెల 26నుంచి నిర్వహించబోయే సంక్రాంతి సంబరాల బ్రోచర్ ను స్థానిక డిఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల లో ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ప్రాచీన సంప్రదాయాలు కళలు భారతదేశ సంస్కృతికి పట్టుకొమ్మలని, భావితరాలకు మన పండుగ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగ సాయి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి జనవరి 10 తేదీ వరకు పట్టణంలోని అన్ని పాఠశాల, కళాశాల లో రంగవల్లులు, ఆటలు, సంక్రాంతి జానపద పాటల పోటీలు తదితర నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లైబ్రరీయన్ కే శిరీష, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్కార్ స్కూల్లో ప్రముఖ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజం జయంతి వేడుకలను నిర్వహించారు.రిటైర్డ్ ప్రొఫెసర్, యూత్ హాస్టల్స్ కార్యదర్శి మట్లపూడి సత్యనారయణ మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రతి రంగం లెక్కతో ముడిపడి ఉందని అన్నారు. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో పరిశోధనలు జరిపి ప్రపంచ గుర్తింపు పొందడం భారత జాతికి గర్వకారణమని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందమూరి రాజేష్, స్కూల్ ప్రిన్సిపల్ సత్యవతి, శ్రీనివాస్ రామానుజన్ చరిత్రపై వివరించారు
