`

`సిగ్మాతెలుగు డాట్ ఇన్ : ఇటీవల ముగిసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో అందరూ ఊహించిన విధంగానే సన్ని సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, టీవీఎస్ బైక్, ఇంకా 25 లక్షలు విలువజేసే స్థలాన్ని సైతం అందుకున్నాడు. మొదట వీడియో జాకీ ఆ తర్వాత యాంకర్, టివి సీరియల్ లో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ 5 విన్నర్ అయ్యాడు. తెలుగువారి మనస్సులు గెలుచుకొన్నాడు. ఇక తెలుగు సినిమా హీరోగా కూడా త్వరలో సకల గుణాభిరామా సినిమాతో బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఖమ్మం నుండి హైదేరాబద్ వచ్చి అంచెలు అంచెలుగా ఎవరి అండ లేకపోయినా, మధ్యతరగతి కుటుంబం నుండి బిగ్ స్టార్ హోదా కోసం.. మొత్తంగా సన్ని సాగిస్తున్న జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలో సకల గుణాభిరామా సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఫలిం వర్గాల సమాచారం. పడ్డ కష్టానికి అదృష్టం తోడయితే.. అది సన్నీ లాగా ఉంటుందేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *