సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా సుప్రసిద్ధ శ్రీ సుబ్రమణేశ్వర షష్ఠి గుడిగా ప్రాచుర్యం పొందిన భీమవరం, శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ( సుబ్బారాయుడి గుడి) దేవాలయం పురాతనం కావడంతో ఆ గుడి పునః నిర్మాణానికి నేడు, ఆదివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కోయ్యే మోషేను రాజు పురప్రముఖులు పాల్గొన్నారు. మహిమానిత్వ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ( సుబ్బారాయుడు షష్ఠి గుడి) ఆలయ పునర్నిర్మాణం నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో రూ1కోటి 50 లక్షల నిధులను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులను మంజూరు కు అంగీకరించింది. దాతల నుండి కూడా విశేషంగా విరాళాలు దేవాలయ పునర్ నిర్మాణానికి అందుతున్నాయి.
