సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్యవైశ్య భవనంలో నేడు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభను, ప్రముఖ వైసిపి నేత, లాయర్, సీనియర్ కృష్ణ అభిమాని రాయప్రోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి హెఛ్ సుబ్బరాజు, గంటా ప్రసాద్ తదితర సీనియర్ కృష్ణ అభిమానులు నిర్వహించారు. ఈ సభలో రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ.. సాహసాల హీరో, తెలుగు సినిమా ను అన్నింటా ముందు ఉంచి ప్రపంచ వ్యాప్తంగా ఒక స్థాయిని ఇచ్చిన మహా మంచి మనిషి ‘సూపర్ స్టార్ కృష్ణ’ మృతి అభిమానులనే కాదు తెలుగువారినందరిని కలచివేసిందని అన్నారు. కృష్ణ అభిమానులకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉందని..వారు చదువుకున్నవారు, సాహసులు , పెద్ద పెద్ద రంగాలలో రాణిస్తున్నారని అటువంటి స్ఫూర్తిని నింపిన కృష్ణ ధన్యుడు అన్నారు. జనసేన నేత కనకరాజు సూరి. రాష్ట్ర బిసి సంగాల నేత, బోర్డు డైరెక్టర్ కామన నాగేశ్వరరావు లు, తదితర ప్రముఖులు తమ చిన్ననాటి నుండి ఎంతటి కృష్ణ అభిమాలులో సభలో గుర్తుచేసుకొన్నారు, భీమవరం డీఎన్ ఆర్ కాలేజీ మొదలు అన్ని ప్రధాన సెంటర్ లలో అల్లూరి సీతారామరాజు రూపంలో కృష్ణ ప్రతిమలు తెలుగు రాష్ట్రాలలో సగర్వముగా నిలబడి ఉన్నాయని వక్తలు తెలిపారు. ఆయన మృతి కి మహేష్ బాబు ఇతర కుటుంబ సబ్యులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో దాయన చంద్రజి, రాయప్రోలు భగవాన్, తదితర ప్రముఖులు తో పాటు ఇతర హీరోల అభిమానూలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం పెద్ద పదవులలో కొనసాగుతున్న భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మొదలు కొని కేంద్ర మంత్రి క్రిషన్ రెడ్డి., మంత్రి రోజా, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ,ఎంపీ రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వంటి వారు కృష్ణ వీరాభిమానులే కావడం గమనార్హం.
