సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఏడవర్డ్ ట్యాంక్ పార్క్ వద్ద ఉన్న స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఆయన 2వ వర్ధంతి నేపథ్యంలో పట్టణంలోని స్థానిక కృష్ణ, మహేష్ బాబు అభిమానులు రాయప్రోలు శ్రీనివాస మూర్తి, బీహెచ్ సుబ్బరాజు, గంట ప్రసాద్ నేతృత్వంలో 1000 మంది పేదలకు ఆహార పొట్లాలలతో అన్నదాన కార్యక్రమం మరియు 200 మంది పేద మహిళలలు కు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భముగా తెలుగు భారతీయ సినీ పరిశ్రమలో తిరుగులేని ఖ్యాతి గాంచిన హీరోగా , రాజకీయ జీవితంలోను నిజ జీవితంలో రియాల్ హీరోగా మంచి కి మారుపేరుగా అయన చేసిన సాహసాలు , ఔదార్యం కృష్ణ అభిమానులు గుర్తుకు తెచ్చుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.
